హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రా ష్ట్రంలోని పలు జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఏపీ తీరం వెంబడి సముద్రమట్టానికి 3.1కి.మీ. నుంచి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపారు.
నిర్మల్, నిజామాబా ద్, జగిత్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని చెప్పారు. హైదరాబాద్లో పొడి వాతావరణం ఉం టుందని, మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉంటాయని చెప్పారు.
సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. గురువారం నారాయణపేట జిల్లా మరికల్లో 2.66 సెం.మీ, మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 2.44 సెం.మీ, సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో 1 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.