హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఉదయం వేళ ఎండ, ఉక్కపోత.. రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నది. గాలిలో తేమ, ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోత ఉంటున్నది. గడిచిన 24 గంట ల్లో యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లిలో అత్యధికంగా 9.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.