భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లెందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గనిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 40 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. గత రెండు, మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.