Heavy Rains | మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఓ గంట పాటు వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అనేక కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. న్యూటౌన్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వరద నీరు నిలిచిపోవడంతో రోగులు, జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగం సూచించింది.