Heavy Rains | హైదరాబాద్ : మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
మరో వైపు పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 23 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక అశ్వరావుపేటలో చల్లని గాలులు వీస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.