బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 13:43:18

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..

హైద‌రాబాద్ : గ‌త కొద్ది రోజుల నుంచి ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షం.. మ‌రోసారి భాగ్య‌న‌గరాన్ని ముంచెత్తింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది. దీంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ అప్ర‌మ‌త్త‌మైంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ.. తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారుల‌కు జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేస్తోంది. డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ప‌లు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. 


logo