న్యూస్‌నెట్‌వర్క్, జూలై 9 (నమస్తే తెలంగాణ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల్లో సోమవారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆళ్లపల్లి, మణుగూరు, జూలూరుపాడు, పాల్వంచలో భారీ వర్షం కురవగా.. ఇతర మండలాల్లో మోస్తరుగా పడింది.
దీంతో ముర్రేడు, మసివాగు, కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగులో వరద నీరు ప్రవహిస్తున్నది. పాల్వంచలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది.