Monsoon | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): విస్తరించిన నైరుతి రుతుపవనాల కారణంగా రానున్న మూడురోజులపాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ శాఖ సోమవారం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. మంగళవారం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నాగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని ఆ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్గాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నాగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
గురువారం ఆదిలాబాద్, నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో వర్షం కురుస్తుందని పేర్కొన్నారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీచేశారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉన్నదని వాతావారణ శాఖ తెలిపింది.
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కి కాల్ చేసేలా మొబైల్/ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.