హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తేతెలంగాణ) : నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావం తో మంగళవారం నుంచి మూడు రో జులపాటు రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.