హైదరాబాద్ : రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంటా పెట్టాల్సిన వడ్లు(Paddy) అకాల వర్షాలకు కండ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే రైతులు కన్నీటి పర్యంమవుతున్నారు. ప్రభుత్వ సహకారం లేకున్నా తన స్వేధంతో సేద్యం చేసిన రైతులు కష్టాలను దిగమింగుకొని ధాన్యపు సిరులు పండించారు.
పుట్లకొద్ది పసిడి సిరులను పండిస్తే కాంగ్రెస్ నిర్లక్ష్యం, రైతుల పట్ల చిన్న చూపుతో తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం, అరకొరా కొన్నా కాంటాలు పెట్టకపోవడం, నెలల తరబడి గన్నీ సంచులు అందక, మద్దతు ధర లభించక, తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ, తీరా కాంటాలు పెట్టాక లారీల కొరతతో లోడింగ్ చేయకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం పంటలు తడిసి ముద్దవుతున్నాయి.
సకాలంలో కొనుగోలు చేసి ఉంటే తమకు నష్టం జరిగేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఉసురు తీసుకునే ఏ ప్రభుత్వం కూడా బాగుపడదని శాపనార్దాలు పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.

రెక్కల కష్టం నీళ్ల పాలు..

చెల్లాచెదురైన అన్నదాతల ఆశలు..

రైతుల గుండె చెరువు..

ప్రభుత్వ నిర్లక్ష్యానికి తడిసి ధాన్యం..


P4

చేతికందిన నోటికందని వైనం..

తీవ్ర నిరాశలో రైతన్నలు..