ఢిల్లీలో గాలివాన బీభత్సం
- తెలంగాణ, ఏపీభవన్ సిబ్బంది నివాసాలు ధ్వంసం
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈదురు గాలులతో మొదలైన వర్షం ఢిల్లీని వణికించింది. చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వాహనాలపైనే చెట్లు విరిగిపడ్డాయి. ఎకడికకడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. గాలి వాన ధాటికి తెలంగాణ, ఏపీ భవన్ వద్ద ఉన్న వందేండ్ల నాటి భారీ వృక్షాలతో పాటు, పెద్దపెద్ద కొమ్మలు విరిగిపడ్డాయి.
దీంతో అక్కడ నిలిపి ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భవన్ల అద్దాలు పగిలిపోయాయి. అద్దాలు తగిలి ముఖేశ్ అనే వ్యక్తి మెడపై గాయాలయ్యాయి. కూలిపోయిన భారీ చెట్లు సిబ్బంది నివాస సముదాయాలపై పడటంతో అవి స్వల్పంగా ధ్వంసమయ్యాయి. వర్షాలకు దెబ్బతిన్న భవనాలకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. పాత భవనాల్లో నివసిస్తున్న సిబ్బందిని ఖాళీ చేయిస్తామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

