Rain Update | హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 5నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ శాఖ తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వాన లు కురిసే అవకాశముందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఆయా జిల్లా కలెక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మలాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల లోతట్టు ప్రాంతాల ప్రజలను సరక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు.
భారీ వర్షాల కారణంగా టీజీఎస్ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 1447 బస్సు సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉద యం నుంచి మరో 570 బస్సులను రద్దు చేసింది. ఖ మ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపుగా వెళ్లే రో డ్లన్నీ జలమయం కావడంతో ఆయా మార్గాల్లో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులను నడుపుతుండగా, వికారాబాద్‌లో 212 బస్సులకు బదులు 50 మాత్రమే నడుపుతున్నట్టు చెప్పారు. అలాగే, భారీ వర్షాలతో 432 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు తెలిపింది. సోమవారం ఉదయం మరో 96 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 5 నాటికి ఏర్పడే అల్పపీడనం ప్రభావం తో ఏపీలో కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శా ఖ పేరొన్నది. వరద ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ట్రయల్ రన్‌ను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. ఈ డ్రోన్లు దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, మెడిసిన్ , తాగునీరు వంటివి తీసుకెళ్తాయనే అంచనాకు వచ్చినట్టు సమాచారం. చిట్టినగర్‌లోని విజయ డెయిరీ నీట మునిగి 70 కోట్ల నష్టం వాటిల్లినట్టు చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు.