Rain Update | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వానపడింది. పలుప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటనలో పేర్కొంది. మరో ఐదురోజులు మోస్త రు నుంచి భారీవర్షాలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.