Rains | తెలంగాణలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లా ఖాసింపేటలో అత్యధికంగా 11.4 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. నాంపల్లి (సిరిసిల్ల) 10.5, తిరుమలాపూర్ (జగిత్యాల) 10.1 సెంటీమీటర్లు, మల్లూరు (ములుగు)లో 9.9, ఫణిగిరి (సూర్యాపేట) 9.3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్ పేర్కొంది. గూడూరు (జనగామ)లో 8.8, జాజిరెడ్డిగూడెం (సూర్యాపేట) 8.5, మర్రిగడ్డ (సిరిసిల్ల)లో 8.4 సెంటీమీటర్లు వర్షం కురిసిందని టీజీడీపీఎస్ పేర్కొంది.
ఆదిలాబాద్ అర్బన్ 7.7, మల్యాల (మహబూబాబాద్) 7.5, జైనద్ (ఆదిలాబాద్) 7.4, నిజామాబాద్ (సిరిసిల్ల)లో 7.4 సెంటీమీటర్లు, పెగడపల్లి (జగిత్యాల) 7.2, గుండాల (కొత్తగూడెం) 7.1, బొరాజ్ (ఆదిలాబాద్) 7.1, ఆవునూరు (సిరిసిల్ల) 6.9, బోయినపల్లి (సిరిసిల్ల) 6.5, పెద్దకొడపగల్ (కామారెడ్డి) 6.4, కొత్తగూడ (మహబూబాబాద్) 6.4, కిష్టారెడ్డిపేట (సంగారెడ్డి) 6.4 వర్షాపాతం నమోదైంది. మరో వైపు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాల్లోనూ పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.