హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఆవర్తనం శనివారం తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటకకు చేరింది. ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం రాయలసీమ, ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కేంద్రీకృతమైన చక్రవాతపు ఆవర్తనం శనివారం బలహీనపడింది. దీంతో రాగల మూడురోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్త రు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుము లు, మెరుపులులతో కూడిన వర్షం కురుస్తుందని, గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది