ములుగు: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలో (Eturnagaram) కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం తెల్లవారు జామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. శివాపురం, గోగుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి పైనుంచి వరద రావడంతో నీట మునిగిపోయాయి. పలువురు రైతులు ఆరబోసుకున్న నిలువ చేసిన ధాన్యం కుప్పల చుట్టూ వరద చేరింది. కొంతమంది రైతుల ధాన్యం వరుదల్లో కొట్టుకుపోయింది. భారీ వర్షంతో వరద పారుతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చి అమ్ముకునే సమయంలో కురిసిన అకాల వర్షంతో నష్టపోయారు.