కల్లాల్లో కన్నీళ్లు తడిసిన ధాన్యం
మిగ్జాం తుఫాన్ తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
- రైతుపై ‘మిగ్జాం’ పిడుగు.. తడిసిన ధాన్యం
- నేలవాలిన వరి, మిర్చి, మక్కపంట
- మిగ్జాం తుఫాన్‌తో ఉమ్మడి ఖమ్మం,వరంగల్ జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 6: మిగ్జాం తుఫాన్ తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి, మిర్చి, మక్కజొన్న పంటలు నేలవాలాయి. పత్తి పూర్తిగా కారిపోయింది.
పలుచోట్ల కలాల్లో, రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం తడిసి మద్దయింది. ఖమ్మం జిల్లాలో 83,000 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13,608 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల వెంబడి ఉన్న మండలాల్లో మిర్చి పంటలు నీట మునిగాయి.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 380 మి.మీ వర్షపాతం నమోదైంది. నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో ఇంటి గోడ కూలి నూకతోటి పుల్లారావు, లక్ష్మి అనే దంపతులు మృతిచెందారు. అశ్వాపురం మండలం భీమవరంలో 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ పరిధిలోని ఓసీలోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సుమారు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.

Paddy
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

