Khammam | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వరదగా వరద పోటెత్తుత్తున్నది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దాంతో వాగు పరివాహకంలోని 15 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర్నగర్, మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. కాలనీలో నీటమునగడంతో బాధితులు ఇండ్లపైకి చేరుకున్నారు. వరద చుట్టుముట్టడంతో బయటకు వెళ్లేందుకు అవకాశం లేకుండాపోయింది. ఇండ్లపై నుంచే రక్షించాలంటూ వరద బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు.
ఇండ్లపైకి చేరుకొని సహాయం కోసం వందలాది మంది నిరీక్షిస్తున్నారు. ఉదయం నుంచి అల్పాహారం లేకుండా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, అధికారులు సహాయక చర్యలు చేపట్టలేదంటూ పలుచోట్ల బాధితులు ఆందోళన చేపట్టారు. ఎంపీగార్డెన్స్లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. రక్షించాలంటూ సహాయం కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు. మరో వైపు ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల మాట్లాడారు. మున్నేరు వరద బాధితుల కోసం హెలికాప్టర్లను పంపాలని కోరారు. కాసేపట్లో మున్నేరు వద్దకు హెలికాప్టర్లు చేరుకోనున్నాయి. అలాగే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశాఖ నేవీ అధికారులతో మాట్లాడారు. ఖమ్మం నగరానికి నేవీ హెలికాప్టర్లను పంపాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం నుంచి కాసేపట్లోనే ఖమ్మానికి హెలికాప్టర్లు చేరుకోనున్నాయి.
Terrifying visuals of #Munneru Vaagu (#MunneruRiver) in #Khammam , overflowing at dangerous levels.
Several people are trapped in the dangerous #Floods in #PrakashNagar and Thirthala Valya Thanda areas of Khammam Town.
Deputy chief minister Bhatti Vikramarka spoke with the… pic.twitter.com/PzrBEbsH54
— Surya Reddy (@jsuryareddy) September 1, 2024