హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (TPTU) డైరీని ఆవిష్కరించారు. 2026 ఏడాదికి సంబంధించి TPTU ఆధ్వర్యంలో రూపొందించిన నూతన డైరీ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు.
ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన జనగామ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
TPTU డైరీని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (TPTU) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన డైరీని మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. pic.twitter.com/AyfwFPaTVs
— KTR News (@KTR_News) January 6, 2026