Bhadrachalam | భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది.
గోదావరి వద్ద ప్రవాహం భారీగా ఉంది. 9,40,345 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. గోదావరి వరద ప్రవాహం వల్ల స్నాన ఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. కల్యాణ కట్ట వరకు వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో నదిలో స్నానాలు ఆచరించే భక్తులు ఎవరూ కూడా లోపలకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగాయి.
మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 1,28,453 కాగా, ఔట్‌ఫ్లో 1,30,715 క్యూసెక్కులుగా ఉంది.