మహబూబ్నగర్ : కృష్ణా నదికి వరదనీటి ప్రవాహం పోటెత్తింది. జిల్లాలోని కృష్ణ మండలం తై రోడ్డు సమీపంలో ఉన్న నదీ పరీవాహక గ్రామం వాసునగర్ను వరద నీరు చుట్టు ముడుతుండడంతో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దాదాపు 50 కి పైగా కుటుంబాలను ఖాళీ చేయించి గుడేబల్లూరు చెక్ పోస్టు వద్ద షిఫ్ట్ చేయించారు. నది పరీవాహక ప్రాంతంలో ఉన్న కృష్ణ, తంగడి, కుసుమూర్తి, లింగదల్లి, ఐనాపూర్, వాసు నగర్, హిందూపూర్ శివారులో వందలాది ఎకరాల్లో వరి పంటలు నీట మునిగాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.