హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షాలకు(Heavy rain) వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడి, కరెంట్ స్తంభాలు నేలకూడలంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు (Kadem project) కువరద ఉధృతి(Heavy flood )పోటెత్తింది. దీంతో అధికారులు10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
ఇన్ ఫ్లో 61,001 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 79,573 క్యూసెక్కులుగా ఉంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 695.225 అడుగులుగా ఉంది. అధికారులు ప్రాజెక్టు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.