హైదరాబాద్: మృగశిర అనగానే గుర్తొచ్చేది చేపలు (Fish). ఈ కార్తె మొదటి రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి ఈ చేపలు ఎంతో మంచిది. దీంతో చేపల మార్కెట్లలో రద్దీ పెరిగింది. హైదరాబాద్లోని చేపట్ల మార్కెట్లన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయి. ముషీరాబాద్ వద్ద రాంనగర్ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చేపల కోసం జనాలు క్యూకడుతున్నారు.