హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కేసు విచారణను సుప్రీంకోర్టు వచ్చేనెల 4కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం సంజ య్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్య లు చేపట్టేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద గత నెల 15న సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ 3 పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం మంగళవారం విచారణ జరపాల్సి ఉన్నది. కానీ, శాసనసభ కార్యదర్శి తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులో లేకపోవడంతో విచారణ మార్చి 4కు వాయిదా పడింది.