హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభు త్వ దవాఖానాల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండే లా చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారుల ను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖా నల్లో నిరంతర విద్యుత్తు సరఫరా, సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ముందస్తు చర్యలపై హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మేధోమథన సదస్సును ఆమె ప్రారంభించారు. అక్కడి స్టాళ్లను పరిశీలించి, ప్రీస్కూల్ వీడియోను ఆవిష్కరించారు.