Health Department | హైదరాబాద్ : వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఓ ఉద్యోగి మాట్లాడుతూ.. 5 నెలల నుండి జీతాలు రావడం లేదు.. ఎట్లా బ్రతకాలి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. బాకీలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అద్దె గదుల్లో ఉంటున్నా.. నెల అద్దె చెల్లించకపోవడంతో ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలి..? రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా మేమే పని చేస్తున్నాం. గాలీజ్ పనులన్నీ తమ చేత చేయిస్తూ చివరకు జీతాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. రెండు ఏండ్లు కావొస్తుంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ డిమాండ్లను నెరవేరుస్తామన్నారు. మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశాం. మా జీతాలు మాకు ఇవ్వండని ధర్నా చేస్తే అరెస్ట్ చేయడం ఏంటి? ఇది ఎంత వరకు సమంజసం అని ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రశ్నించాడు.
పెండింగ్లో ఉన్న 5 నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, కార్పొరేషన్స్ ద్వారా జీతాలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
5 నెలల నుండి జీతాలు రావడం లేదు.. ఎట్లా బ్రతకాలి అంటూ కంటతడి పెట్టిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి
బాకీలు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాము అంటూ ఆవేదన
మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేసాము
మా జీతాలు మాకు ఇవ్వండని ధర్నా చేస్తే అరెస్ట్ చేయడం ఏంటి? pic.twitter.com/ezfq0lTkhg
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2025