హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజారోగ్యం మెరుగుదలతో పాటు రోగుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. సోమవారం సచివాలయంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కౌన్సిల్ తొలి సమావేశం జరిగింది. ప్రైవేటు దవాఖానల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారు?.. నకిలీ వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై చర్చించారు.
కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జడ్ చొంగ్తూ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ నరేంద్ర కుమార్, డీహెచ్ రవీంద్ర నాయక్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.