హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సోమవా రం రాజ్భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఎన్జీవోలు ముందుకురావడం మంచి పరిణామమని కొనియాడారు. దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్, రాష్ట్ర దివ్యాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య పాల్గొనారు.