మహబూబాబాద్‌లో విషాదం నెలకొంది. కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హెడ్ కానిస్టేబుల్ గుండెబోయిన శ్రీనివాస్ కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం నాటు ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ఉన్నట్టుండి.. తన దగ్గర ఉన్న ఎస్ఎల్ఆర్ గన్‌తో గుండెపై కాల్చుకున్నాడు. తుపాకీ పేలుడు శబ్దం విన్న సహోద్యోగులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా, శ్రీనివాస్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.