BTech seats | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇష్టారీతిన బీటెక్ సీట్ల పెంపు, కోర్సుల కన్వర్షన్కు ముందుగా ముకుతాడు వేసే దిశలో కసరత్తు జరుగుతున్నది. డి మాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల పెంపు, కోర్ కోర్సుల మూసివేతకు బ్రేకులు వేసే యోచనలో ప్రభుత్వమున్నది. నిరుడు 9వేల సీట్ల కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, జేఎన్టీయూ ఎన్వోసీ ఇవ్వగా, ఏఐసీటీఈ సైతం పచ్చజెండా ఊపింది. అయితే తీరా ఈ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్లు వేసింది. ఆ తర్వాత ఒత్తిళ్లతో కొన్ని కాలేజీలకు అనుమతి ఇచ్చింది. దీం తో మిగతా కాలేజీల యాజమాన్యా లు హైకోర్టు, సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయి.
ఈ నెల 25 నుంచి దరఖాస్తులు..
2025-26 విద్యాసంవత్సరంలో కాలేజీలు, కోర్సులకు అనుమతులిచ్చేందుకు ఇటీవలే ఏఐసీటీఈ షె డ్యూల్ విడుదల చేసింది. 25 నుంచి డిసెంబర్ 9 వరకు కాలేజీలకు దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు. పెనాల్టీతో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు గడువు ఇచ్చారు. కాగా, ఫార్మసీ విధానాన్ని బీటెక్ కోర్సులకు వర్తింపజేయాలని ప్రభుత్వవర్గాలు అనుకుంటున్నట్టు తెలిసింది.