ఇచ్చోడ : ‘కపాస్ కిసాన్ యాప్ హఠావో.. కపాస్ కిసానోం కో బచావో’ అంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) రైతులు సోమవారం సెల్ఫీలు దిగారు. చేతిలో పత్తి పట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్‌రెడ్డికి సెల్ఫీ వీడియోలు పంపారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఏటా సీసీఐ ఎకరానికి 12 క్వింటాళ్లు పత్తి కొనేదని, ఈ ఏడాది ఏడు క్వింటాళ్లు మాత్రమే కొంటున్నదని మండిపడ్డారు. మిగిలిన పత్తిని ప్రైవేట్‌లో అమ్మి నష్టపోతున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు.