భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం మొత్తం బీఆర్ఎస్లో చేరింది. ఆ గ్రామంలో 350 మంది ఓటర్లుండగా అంతా కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు.
సర్పంచ్ స్వరూప, ఆదివాసీ జిల్లా కార్యదర్శి మడకం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
– అశ్వారావుపేట రూరల్