వరంగల్ : రైతు సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరే అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి తెలిపారు. రైతు బంధు సంబురాలలో భాగంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు బందు పథకంలో భాగంగా నాలుగు ఏళ్లలో రైతుల ఖాతాలలో రూ. 50వేల కోట్లు జమ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దేశంలోనే అత్యుత్తమ పథకం తెలంగాణ రైతుబంధు అని, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలధారం అయిన వ్యవసాయ రంగాన్ని లాభాసాటిగా మార్చాలన్నారు. రైతులను అప్పుల ఊబి నుంచి విముక్తులను చేయాలనే సంకల్పంతో నిరంతరం సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, డివిజన్లు, గ్రామాలలో రైతు బంధు సంబారాలలో భాగంగా రైతులతో ఆత్మీయ సమావేశాలు, విద్యార్థులతో వ్యాస రచన పోటీలు, యువకులతో క్రీడా పోటీలు, మహిళలతో ముగ్గుల పోటీలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి కోర్డినేటర్ ఎల్లావుల లలిత, తదితరులు పాల్గొన్నారు.