HCU | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మం డలం కంచ గచ్చిబౌలీలోని సర్వే నం.25లోని 400 ఎకరాలను టీజీఐఐసీకి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 54ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సుప్రీంకోర్టు తీర్చునకు విరుద్ధంగా భూమి కేటాయించారని, దీనిని రద్దు చేయాలని హైదరాబాద్‌కు చెందిన కే బాబూరావు మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా (భోజన విరామ సమయంలో) విచారణ చేపట్టాలని తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. విచారణ బుధవారం చేపడతామని హైకోర్టు ప్రకటించింది. ఇదే అంశంపై వట ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో కలిపి విచారణ జరుపుతామని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో.. టీఎన్ గోదావర్మన్ తిరుమల్పాడ్ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నదని పిటిషనర్ తెలిపారు. ‘ప్రభుత్వ రికార్డుల్లో అది అటవీ ప్రాంతంగా నమోదు కాకపోయినా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెట్లు, పక్షులు ఉన్న ప్రదేశాన్ని అటవీ ప్రాంతంగా పరిగణించాలి. ఇలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి పనులకు కేటాయించడం చట్ట వ్యతిరేకం. కేటాయించే ముందు ఓ కమిటీ ఏర్పాటుచేసి అధ్యయనం చేయాలని చట్టం నిర్దేశిస్తున్నది. దట్టమైన ఆటవీ ప్రాంతం కాకపోయినా అకడున్న చెట్లు, గడ్డి మొకల కారణంగా పక్షులకు, వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్నది.
కేబీఆర్ పారు, మృగవణి నేషనల్ పారులా ఇది కూడా వివిధరకాల పక్షులు, జంతుజాలాలకు అవాసంగా ఉన్నది. భారీ కంపెనీలు నివాస సముదాయాలతో ఆపారమైన అభివృద్ధితో ముందుకు సాగుతున్న హైదరాబాద్‌లో 400 ఎకరాల్లోని అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేయడం వల్ల పర్యావరణ విపత్తు వాటిల్లే అవకాశం ఉన్నది. న్యాయసమీక్ష, నిపుణుల కమిటీల పరిధి నుంచి తప్పించే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో 30 నుంచి 40 బుల్డోజర్లు వినియోగించి అకడ భూమిని చదును చేస్తున్నది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. కేజీ ఫారెస్టు చెట్లు, ఆరు అడుగుల ముండ్ల పొదలతో పలు పక్షులు, కీటకాలకు, జంతువులకు అవాసంగా ఉన్నది.
కేజీ ఫారెస్టులో పీకాక్ లేక్, బఫెలో లేక్ వంటి నీటి కుంటలు ఉన్నాయి. రెండు బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన పుట్టగొడుగుల ఆకారంలో ఉన్న ప్రత్యేకమైన రాళ్లు ఇకడ ప్రత్యేకం. ఈ అటవీ ప్రాంతంలో 734 పూల మొకలు, 10 రకాల క్షీరదాలు, 15 రకాల సరీసృపాలు, 230 జాతుల పక్షలున్నాయి. ఇకడ జింకలు, బల్లులు, కొండ చిలువలు, నెమళ్లు, కుందేళ్లు, గుడ్లగూబలు, ఫ్లెమింగో పక్షులు, తాబేళ్లు, అడవి పందులు వంటి వాటితోపాటు హిమాలయ ప్రాంతాల నుంచి వచ్చే అరుదైన వలస పక్షిజాతులు ఉన్నాయి. కేబీఆర్, మృగవణి జాతీయ పారులకంటే ఎకువ పక్షులు జంతువులు ఇక్కడ ఉన్నాయి.
ఇది వాటికంటే వైవిధ్యమైనది. అంతేగాకుండా కేంద్ర పర్యావరణ నోటిఫికేషన్ ప్రకారం 150 ఎకరాలకు మించిన ఆటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నట్లయితే పర్యావరణ అధ్యయనం చేసి తీరాలి. చెట్లను నరకాలంటే వాల్టా చట్టం కింద సంబంధిత అధికారి వద్ద అనుమతి పొందాలి. అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అటవీ ప్రాంతాన్ని ఇతర ప్రయోజనాలకు కేటాయించినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి పొందాలి. కేంద్రం నుంచి టీజీఐఐసీ ఎలాంటి అనుమతులు పొందలేదు.
ఈ విషయం పత్రికా ప్రకటన ద్వారా వెల్లడైంది. ఆదాయం పెంచుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ వ్యతిరేక నిర్ణయం తీసుకుని జీవో జారీచేసింది. ప్రభుత్వం జీవుల వైవిధ్యాన్ని పట్టించుకోవడం లేదు. పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు అకడ ఎలాంటి పనులు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి’ అని పిటిషర్ కోరారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అటవీ, పర్యావరణ, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులు, ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టీజీఐఐసీ, కేంద్రం, రాష్ట్ర ముఖ్య అటవీ సంరక్షణాధికారి, చీఫ్ కన్జర్వేటర్, జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేశారు.