హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : కంచ గచ్చిబౌలి భూములపై హెచ్సీయూకు ఎలాంటి హక్కుల్లేవని, ఆ విషయం విద్యార్థులు, అధ్యాపకులకు తెలుసని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రతిపక్షాల కుట్రలో పావు లు మాత్రమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడి యాతో చిట్‌చాట్ నిర్వహించారు. భూముల వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రకు తెరలేపాయని ఆరోపించారు.
హైదరాబాద్, ఏప్రిల్7 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని హెచ్‌సీయూకే అప్పగించాలని బీసీ సంక్షేమ సంఘం జా తీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద ఆయన సోమవారం మాట్లాడారు. వర్సిటీ విద్యార్థులపై నిర్బంధకాండను ఆపివేయాలని హెచ్చరించారు.