‘ఎమ్మెల్సీ’పై హైకోర్టుకు దాసోజు, కుర్రా
శాసనమండలి సభ్యులుగా నియమించాలని మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడానికి వీల్లేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈ నెల 5న విచారణ చేయనున్నది. ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను నామినేట్ చేయాలని కోరుతూ కేసీఆర్ సర్కా రు గత జూలైలో చేసిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
- గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం
- హైకోర్టులో పిటిషన్ దాఖలు
- రేపు సీజే నేతృత్వంలో విచారణ
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): శాసనమండలి సభ్యులుగా నియమించాలని మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడానికి వీల్లేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈ నెల 5న విచారణ చేయనున్నది. ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణను నామినేట్ చేయాలని కోరుతూ కేసీఆర్ సర్కా రు గత జూలైలో చేసిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
ఈ చర్యను సవాల్ చేస్తూ వీరిద్దరు పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, రాజ్యాంగం ప్రకారం మంత్రివర్గం చేసిన సిఫార్సులను గవర్నర్ ఆమోదించి తీరాలని తెలిపారు. ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ తిరస్కరించటం ఏకపక్షమని, చట్టవిరుద్ధమని ప్రకటించాలని పిటిషన్లో కోరారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం గవర్నర్కు విచక్షణాధికారం లేదని పేర్కొన్నారు. అయితే, గవర్నర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయటం వీలుకాదంటూ పిటిషన్పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

