హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 18న రాష్ట్ర హైకోర్టుతోపాటు అన్ని న్యాయస్థానాలకు సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 18న వినాయక చవితిని నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఆ రోజును పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది.
దీంతో 19న హైకోర్టు సహా అన్ని కోర్టులు యథావిధిగా విధులు నిర్వర్తించనున్నాయి. ఈ ఆదేశాలు రాష్ట్ర హైకోర్టు పరిపాలనా నియంత్రణలో పనిచేస్తున్న అన్ని కార్యాలయాలకు వర్తిస్తాయని రిజిస్ట్రార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.