జమ్మికుంట/హుజూరాబాద్‌టౌన్, జనవరి 20: ‘దళితుల ఉద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణ యం తీసుకున్నది. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది గొప్ప విప్లవాత్మక పథకం. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇ వ్వడమంటే మాటలు కాదు. ఎలాంటి గ్యారం టీ లేదు. రీ పేమెంట్ లేదు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నగదు జమ. కూలీలందరూ.. ఓనర్లుగా మారిన్రు. ఈ పథకం అమలుతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దళితులకు ఒక్క తెలంగాణ ప్రభుత్వంలోనే గౌర వం దక్కింది. ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పథకం. తమిళనాడు ప్రభుత్వానికి మేము నివేదిక ఇస్తం. దళిత బంధువు కేసీఆర్ సార్.. హ్యాట్సప్. జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ తమిళనాడు వీసీకే(విడుదలై చిరుతైగల్ కట్చి/దళిత్ పాం థర్స్ పార్టీ) ఎమ్మెల్యేలు సింథనై సెల్వన్(కట్టుమన్నార్కోయిల్ నియోజకవర్గం), ఎస్ఎస్ బాలాజీ(తిరుపోరూర్ నియోజకవర్గం), అధ్యయన కమిటీ లీడర్ రమేశ్ నాథన్(సోషల్ అవేర్నెస్ సొసైటీ ఫర్ యూత్) కొనియాడారు.
జమ్మికుంట, హుజూరాబాద్‌లో పర్యటన
హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలు, తీరుతెన్నులపై అధ్యయనం చేసేందుకు రమేశ్నాథన్ ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యేలు, పలు పార్టీలు, దళిత సంఘాల నాయకులు, సామాజికవేత్తల బృందం శుక్రవారం జమ్మికుంట, హుజూరాబాద్‌లో పర్యటించింది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో కలిసి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో విజయవంతంగా నిర్వహిస్తున్న ఐదుగురి వ్యాపారాలను పరిశీలించింది. హుజురాబాద్‌లో జ్యూట్ బ్యా గుల పరిశ్రమలను సందర్శించిన బృంద సభ్యు లు.. యజమానులతో ముచ్చటించారు ఖర్చులన్నీ పోనూ.. నెలకు రూ.20 వేల నుంచి రూ. 30 వేల దాకా మిగులుతున్నయ్. దళిత బం ధుతో దర్జాగా బతుకుతున్నం. ఒక్క సీఎం కేసీఆర్‌తోనే ఇది సాధ్యమైంది’ అని లబ్ధిదారులు చెప్పడంతో ఎమ్మెల్యేలు, అధ్యయన కమిటీ బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.