Electricity consumption | అభివృద్ధి సూచికల్లో తలసరి విద్యుత్తు వినియోగం ఒకటి. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో తలసరి విద్యుత్తు వినియోగం తగ్గిందా? పెరిగిందా? అనే వివరాలను మాత్రం సర్కారు గోప్యంగా ఉంచింది. సోమవారం విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రక్ట్-2024 నివేదికలో పాత వివరాలనే పొందుపరిచింది. 2022-23లో రాష్ట్రంలో తలసరి విద్యుత్తు వినియోగం 2,349 యూనిట్లు ఉన్నట్టుగా ప్రకటించింది.
2023-2024, 2024-25 సంవత్సరాల వివరాలను నివేదికలో వెల్లడించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగం కేవలం 1,331 యూనిట్లు ఉండగా, కేసీఆర్ పాలనలో 2,349 యూనిట్లుగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. మరి కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఇది తగ్గిందా? పెరిగిందా? అనే వివరాలను ప్రభుత్వం పొందుపర్చలేదు.