హైదరాబాద్, అక్టోబరు 8 (నమస్తే తెలంగాణ): కాశ్మీర్లో బీజేపీని, హర్యానాలో కాంగ్రెస్‌ను విశ్వసించలేదని, రెండు జాతీయ పార్టీలపై ప్రజల్లో విముఖత ఉన్నదనేది స్పష్టమైందని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చిచెబుతున్నాయని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారని పేర్కొన్నారు. ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతీకార, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు.
రేవంత్‌రెడ్డికి ఆశాభంగం!
హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ) : హర్యానా ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ మోడల్ గెలిచిందని ప్రచారం చేసుకోవాలని ఉవ్విళ్లూరిన సీఎం రేవంత్‌రెడ్డికి శృం గభంగం తప్పలేదు. అనూహ్యంగా కాంగ్రెస్ ఓటమిపాలవ్వడంతో రేవ ంత్‌రెడ్డి ఎవరితోనూ మాట్లాడకుం డా.. ఎవర్నీ కలవకుండా నిరుత్సాహంతో రాష్ర్టానికి తిరిగి పయనమయ్యారని తెలిసింది. ఎలాగూ కాం గ్రెస్ గెలుస్తుంది కాబట్టి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ తెలంగాణ మోడల్ గెలిచిందని ప్రచారం చేయాలని రేవంత్‌రెడ్డి తొలుత భావించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి మీడియా వాళ్లకు సమాచారం కూడా ఇచ్చారు. కానీ తీరా ఫలితాలు తారుమారు కావడంతో ప్రెస్‌మీట్‌ను రద్దు చేసుకున్నారు.