యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆయన దశ దినకర్మ, సంతా ప సభను భువనగిరి పట్టణంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సూ ర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సంతా ప సభకు హాజరై బాలకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కుం భం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాద రి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగ య్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, బూడిద భిక్షమయ్యగౌడ్, నా యకులు గొంగిడి మహేందర్‌రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.