Harish Rao | రాష్ట్ర ప్రజలకు హరీశ్‌రావు బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణ కల సాకారమైందని అన్నారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ లేదు.. బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
నాలుగు కోట్ల మంది ప్రజలకు ఏకతాటి మీదకు తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ అని హరీశ్‌రావు కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందని అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంతో సంతోషంగా బతుకుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల్లో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు. రాష్ట్రం 33 జిల్లాలుగా ఏర్పడిందన్నా.. సిద్దిపేట జిల్లాగా మారిందన్నా కేసీఆర్ కృషే కారణమని స్పష్టం చేశారు. బీడువారిన భూములను సస్యశ్యామలంగా మార్చిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుదే అని హరీశ్‌రావు అన్నారు.