Harish Rao : బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేటలో రూ. 10 కోట్ల వ్యయంతో ప్రారంభమై పూర్తి దశకు చేరుకున్న ఆయుష్ ఆసుపత్రిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) సందర్శించారు. ఈ సందర్భంగా యునానీ, హోమియో సేవలను వచ్చే 15 రోజుల్లో అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆయన సూచించారు. ఇంకా పూర్తికావాల్సిన పనులు, అవసరమైన పనులపై ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడిన హరీశ్ రావు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిఫుల్ సెక్రటరీ క్రిస్టియనా, టిజీఎం ఐడీసీ ఎండీ ఫణిందర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శశిధర్, ఈఈ రవీందర్ రెడ్డిలతో ఎమ్మెల్యే మాట్లాడారు.
ఆయుష్ ఆసుపత్రికి సంబంధించిన అన్ని సేవలు అందుబాటులోకి తేవాలని హరీశ్ రావు అధికారులకు సూచించారు. ఆస్పత్రికి అవసరమైన ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయుష్, యునాని, హోమియోకి సంబంధించిన వైద్యులను, థెరఫీస్ట్లను నియమించి ప్రజలకు సేవలు అందించాలాని ఆయన కోరారు. ఆయుష్ ఆసుపత్రి పక్కనే ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను సందర్శించిన ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సరఫరాపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సిద్దిపేటలో గత ప్రభుత్వంలో రూ. 10 కోట్లతో నిర్మించి పూర్తి దశకు చేరుకున్న ఆయుష్ ఆసుపత్రి ని మాజీ మంత్రి ఎమ్మెల్యే @BRSHarish గారు సందర్శించారు..
ఈ సందర్భంగా యునాని, హోమియో ఆసుపత్రి సేవలను వచ్చే 15 రోజుల్లో అందుబాటులో కి తేవాలని అధికారులకు సూచించారు.
మిగులు పనులు, అవసరమైన… pic.twitter.com/ADCd9IDo7P
— Office of Harish Rao (@HarishRaoOffice) January 19, 2026
అదే విధంగా నిర్మాణంలో ఉన్న వెయ్యి 1,000 ఆసుపత్రి పనులు ముమ్మరంగా చేపట్టాలని హరీశ్ రావు సూచించారు. జూన్ నెలలో ప్రజలకు ఆసుపత్రి ని అందుబాటులోకి తెచ్చి వైద్య సేవలు అందించాలని ఆయన తెలిపారు. ఈ ఆసుపత్రి పూర్తి అవుతే ఎం ఆర్ ఐ స్కాన్, క్యాత్ లాబ్, క్యాన్సర్ సేవలు అందుబాటులోకి వస్తాయని హరీశ్ వెల్లడించారు. అనారగ్యోంతో బాధపడుతున్నవారు హైదరాబాద్ వెళ్లే పరిస్థితి ఉండదని, అందుకని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఇకకరీంనగర్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న నర్సింగ్ కళాశాల పనులు వెంటనే ప్రారంభించాలని, జూన్ లోగా కళాశాలను అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.