పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీకి చేరుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం సీనియర్ న్యాయవాదులతో హరీశ్‌రావు, వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర సమావేశం కానున్నారు.
కాళేశ్వరంపై ఎల్లుండి తెలంగాణ హైకోర్టులో తీర్పు రానుంది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల కేసు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ త్రిసభ్య బృందం చర్చించనుంది. ఒకవేళ హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. దీనిపై కూడా న్యాయవాదులతో చర్చించనున్నారు.