హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన, ఐఐటీనే తన ఇంటిపేరుగా మా ర్చుకున్న సరస్వతీ పుత్రుడు ఐఐటీ రామయ్యను కలుసుకోవడం ఆనందంగా ఉన్నదని హరీశ్‌రావు ఆదివారం ట్వీట్ చేశారు. 98 ఏండ్ల వయస్సులో కూడా రామయ్య సమాజం గురించి ఆలోచించడం గొప్పవిషయమని వెల్లడించారు. సిద్దిపేటతో ఆయనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను తనతో పంచుకున్నారని చెప్పారు. రామయ్య నూరేళ్లకు పైబడి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.