Minister Harish rao | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధు పథకం తెలంగాణలో రైతన్నను రాజును చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతుబంధు పథకం ప్రారంభమై బుధవారానికి ఐదేండ్లు పూర్తి కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు పథకం వ్యవసాయాన్ని, పండుగ చేసి రైతన్నను రాజును చేసింది.
ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 10 విడతల్లో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసి, అద్భుతమైన రైతు సంక్షేమ పథకంగా దేశానికి రోల్‌మాడల్ అయ్యింది. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, ఎత్తుకున్న జాతీయ నినా దం దేశవ్యాప్తంగా ప్రతి ఒకరినీ ఆలోచింపచేస్తున్నాయి. అబ్ కీ బార్.. కిసా న్ సరార్.. అంటూ బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నాయి’ అని ట్వీట్ చేశారు.