హైదరాబాద్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని హరీశ్ రావు (Harish Rao) అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి అని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ త్యాగాలకు గుర్తుగా వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేసింది. భావితరాలకు ఆ మహనీయురాలి చరిత్ర తెలువాలని పాఠ్యాంశంగా పెట్టి గౌరవించిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక.. మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ.
నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి.
నేడు… pic.twitter.com/szs6upnEia
— Harish Rao Thanneeru (@BRSHarish) September 10, 2024