హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదలశాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు నేడు (సోమవారం) హాజరుకానున్నారు. కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ హరీశ్‌రావును విచారించనున్నారు.
ఇప్పటికే అన్నిదశల్లో విచారణ పూర్తిచేసిన కమిషన్.. ప్రస్తుతం రాజకీయ ప్రముఖులను విచారిస్తున్నది. ఇప్పటికే ఆర్థికశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రశ్నించగా నేడు హరీశ్‌రావును విచారించనుంది.