Harish Rao | పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు నిర్విరామంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతో శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండి, అంకితభావంతో మీరు పడిన కష్టం, తపన నాతో పాటు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.