నేను రేవంత్ లాగా చిల్లర మాటలు మాట్లాడను. రైతుబంధు ఎప్పుడిస్తవ్? రైతుబీమా ఎప్పుడిస్తవ్? బోనస్ ఏమైంది? ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్నడేస్తవ్? అని ప్రజల పక్షాన సూటిగా ప్రశ్నిస్తూనే ఉంటా. హామీలు నెరవేర్చేదాకా నేను నిన్ను నిలదీస్తూనే ఉంటా. సాములు బయటపెడుతూనే ఉంటా
-హరీశ్‌రావు
సిద్దిపేట, జూన్ 17( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘సీఎం రేవంత్‌రెడ్డిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్.. సంక్షేమ పథకాలకు చిల్లిగవ్వ ఇవ్వరు కానీ, బడా కాంట్రాక్టర్లకు బిల్లులిస్తే కమీషన్లు వస్తాయని సర్కార్ పైసలన్నీ అటే మళ్లిస్తున్నాడు’ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించా రు. కమీషన్లు రాని దళితబంధు, కులవృత్తుల సంక్షేమాన్ని, విద్యార్థుల ఫీజుల పథకాన్ని నిలువునా పాతరేశారని ధ్వజమెత్తారు. గురుకుల పిల్లల కోడిగుడ్లలో కూడా కమీషన్లు కొ డుతున్నాడని ఆరోపించారు. సర్కార్ ఖజానా లో పైసలే లేవంటాడు కానీ.. ఎంసీహెచ్ఆర్డీలో రూ.100 కోట్లతో క్యాంప్ ఆఫీస్, సీఎం ఇంటికి రూ.17 కోట్లతో ఇనుప కంచెలు కట్టుకుంటున్నాడని ఘాటుగా ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలతో కాకుండా తన మనుమడు, మంత్రులు, రాహుల్‌గాంధీ దోస్తుల పిల్లలతో ఫుట్‌బాల్ ఆడేందుకు వందలాది కోట్లు ఖర్చు పెడుతున్నాడని మండిపడ్డారు.
హైదరాబాద్ లో మోరీలు బాగుచేయడం చేతకాని వాడు ఫ్యూచర్ సిటీ కడుతాడట? రూ.1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ అని కమీషన్లకు కకుర్తి పడుతున్నాడని మండిపడ్డారు. జర్నలిస్టుల సంక్షేమానికి కేసీఆర్ నాడు రూ.100 కోట్లు ఇస్తే, ఇప్పడు కమీషన్లు రావని రేవంత్ జర్నలిస్టులకు ఒక రూ పాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. కేసీఆర్ ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే, కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రజలను అప్పుల పాలు చేస్తన్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా ఇస్తామన్న రూ.లక్ష కూడా ఇవ్వలేదని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ని యోజకవర్గస్థాయి సభ్యత్వ నమోదు, ‘సర్’ అవగాహన సదస్సుకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచలా వదిలేసిన త్యాగాలు బీఆర్ఎస్వి అని, జిరాక్స్ కాపీలతో డ్రామాలాడి గద్దెనెకిన మోసాలు రేవంత్రెడ్డివని పేర్కొన్నారు.
‘ప్రజా సమస్యలపై నేను నిలదీస్తే నా ఎత్తు గురించి చిల్లరగా మాట్లాడుతావా రేవంత్‌రెడ్డీ? సూల్ పిల్లల కార్యక్రమానికి పోయి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నా ఎత్తు మాట్లాడుతావా? అసలు నా ఎత్తుతో నీకేం పని? నువ్వు ఎగ్గొట్టిన పథకాలపై, చేస్తున్న సాములపై ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం..’ అని హరీశ్‌రావు హెచ్చరించారు.
గౌరవెల్లి ప్రాజెక్టును ప్రత్యేక ప్యాకేజీతో పూర్తిచేసి కేసీఆర్ నాడు ట్రయల్న్ చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 30 నెలలైనా కనీసం 30 గజాల కాలువను కూడా తవ్వలేదని హరీశ్‌రావు ఆరోపించారు. సొంత జిల్లాలోని పాలమూరు ప్రాజెక్టు అర్థం కావడానికే తనకు రెండున్నరేండ్లు పట్టిందని రేవంతే స్వయంగా అన్నాడని, మరి గౌరవెల్లి అర్థం కావడానికి ఐదేండ్లు పడుతుందా? అని ప్రశ్నించారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 610 జీవో అమలు చేయకపోతే, పోతిరెడ్డిపాడు పెంచుతుంటే.. తెలంగాణ కోసం తమ పదవులను తృణప్రాయంగా వదిలేసి రాజీనామాలు చేశాం. ఆనాడు ముందుగా స్పీకర్‌కు రాజీనామాలు ఇచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. రేవంత్‌రెడ్డి మాత్రం ఒరిజినల్ కాపీ జేబులో పెట్టుకొని జిరాక్స్ కాపీ ఇచ్చి డ్రామాలాడాడు. ఎలాంటి త్యాగం చేయని ఆ వ్యక్తే ఇప్పుడు సీఎం అయ్యాడు.
హుస్నాబాద్ నియోజకవర్గం అంటే కేసీఆర్‌కు ఎంతో నమ్మకమని, ఇకడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించేవారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కేసీఆర్ సైకిల్‌యాత్రకు బ్రహ్మర థం పట్టి, తొలిరోజుల్లోనే ఎంపీపీలు, జడ్పీటీసీలను గెలిపించిన గడ్డ ఇదేనని పేర్కొన్నారు.
‘గత ఎన్నికల్లో కృతజ్ఞతకు, ఆశకు మధ్య పోటీ జరిగింది. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలకు మోసపోయారు. కానీ ఇచ్చిన హామీలను అసలే అమలు చేయని రేవంత్ మోసగాడన్న నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది’ అని హరీశ్‌రావు తేల్చి చెప్పారు.
కేసీఆర్ అభిమానుల, బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు ఎకడా గల్లంతు కాకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా చూసుకోవాలని హరీశ్‌రావు కార్యకర్తలకు సూచించారు. ఒక ఓటు కూడా ఎన్నికల్లో క్రియాశీలకంగా మారుతుందని చెప్పారు. ‘సర్’ ఓటర్ల సర్వే విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
హిట్లర్ ఆదర్శం అని చెప్పుకొంటున్న రేవంత్‌రెడ్డికి నాడు నియంత హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఐరోపాలో హిట్లర్ పేరెత్తితే ఎలా నిషేధిస్తారో, రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని కూడా ప్రజలు నిషేధించే రోజు వస్తుందని చెప్పారు. ఖమ్మంలో 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం జరిగితే ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పట్టించుకోనే లేదని మండిపడ్డారు.
తాను నిమ్స్‌కు వెళ్లి, బయట మందులు కొనుక్కొంటున్న ఆ తల్లి బాధను, బిల్లులను మీడియాకు చూపిస్తే అప్పుడు ఈ దద్దమ్మ ప్రభుత్వం కదిలి వచ్చిందని చెప్పారు. దేశంలో ఎకడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకగా నిలబడి పోరాడుతున్నదని, ఎకడ అన్యాయం జరిగితే అకడ బాధితుల పక్షాన బీఆర్ఎస్ నిలుస్తుందని స్పష్టంచేశారు.